చాక్లెట్ దొంగలు.. గోదాంలో చొరబడి రూ.17లక్షల విలువైన చాక్లెట్లు చోరీ

-

నగదు దొంగలు, గొలుసు దొంగలు, ఆఖరికి దుస్తుల దొంగల గురించి విన్నాం. కానీ చాక్లెట్ దొంగల గురించి విన్నారా. చాక్లెట్ దొంగలేంటి అనుకుంటున్నారా. నిజమండీ లక్నోలో రూ.17 లక్షల విలువైన క్యాడ్బరీ చాక్లెట్లను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో ఈ చోరీ వెలుగులోకి వచ్చింది.

చిన్హత్‌ ప్రాంతంలో నివాసముండే రాజేంద్ర సింగ్ సిద్ధు చాక్లెట్ల డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు. ఇందుకోసం తనకు చెందిన ఓ ఇంటిని గోదాంగా వినియోగిస్తున్నాడు. అయితే సోమవారం, మంగళవారం రాత్రి ఆ గోదాంలోకి చొరబడిన కొందరు దొంగలు అందులోకి మొత్తం చాక్లెట్లను లూటీ చేశారు. వాటి విలువ రూ.17లక్షల ఉంటుందని ఆ పంపిణీదారు పేర్కొన్నాడు. చాక్లెట్లే కాదు అక్కడి సీసీ కెమెరాలు, ఇతర పరికరాలను సైతం చోరీ చేశారు.

బుధవారం ఉదయం గోదాం తలుపులు తెరిచి ఉండటాన్ని గుర్తించిన కొందరు యజమాని సిద్ధుకి సమాచారం అందించారు. అతడు వెళ్లి చూడగా.. గోదాం మొత్తం ఖాళీగా కనిపించింది. దీంతో చోరీపై చిన్హుత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సమీప సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. చోరీ గురించి ఎవరికైనా తెలుసుంటే, తమకు చెప్పాలని ప్రజలను కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version