పండుగ పూట‌ విషాదం .. పొట్టేలుకు బదులు మ‌నిషి బ‌లి

-

తాగిన మైకంలో బ‌లి ఇవ్వ‌డానికి తీసుకువ‌చ్చిన పొట్టేలు కు బ‌దులు దానిని ప‌ట్టుకున్న మ‌నిషిని న‌రికారు. ఈ విషాద‌క‌ర‌ ఘ‌ట‌న ఆంధ్ర ప్ర‌దేశ్ లోని చిత్తురు జిల్లాలో గ‌ల మ‌ద‌న‌ప‌ల్లె లో చోటు చేసుకుంది. అయితే మ‌ద‌న‌ప‌ల్లెలో ఉన్న ఎల్ల‌మ్మ దేవాల‌యం వ‌ద్ద పశువ‌ల పండుగా చేస్తున్నారు. ప‌శువుల పండుగ‌లో భాగంగా ఎల్ల‌మ్మ దేవ‌తకు పొట్టేలును బ‌లి ఇవ్వాల‌ని భావించారు. పొట్టేలును బ‌లి ఇచ్చే ముందు అక్క‌డ ఉన్న వారంతా.. మ‌ద్యం సేవించారు.

అనంత‌రం పొట్టేలును బ‌లి ఇవ్వ‌డానికి సిద్ధం అయ్యారు. కాగ టీ. సురేష్ అనే వ్య‌క్తి పొట్టేలును ప‌ట్టుకున్నాడు. దీంతో మ‌రో వ్య‌క్తి మ‌ద్యం మైకంలో పొట్టేలు న‌ర‌క‌బోయాడు. కానీ ప్ర‌మాద‌వశాత్తు క‌త్తి వేటు పొట్టేలు పై కాకుండా దానిని పట్టుకున్న టి. సురేష్ పైన ప‌డింది. దీంతో సురేష్ అక్క‌డికక్క‌డే మృతి చెందాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేర‌కున్నారు. అలాగే ఈ ఘ‌ట‌న పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్త జ‌రుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version