న్యూయ‌ర్ అని ఈత‌కు వెళ్తే విషాదం.. ఇద్ద‌రు మృతి

-

కొత్త సంవ‌త్స‌రం అని ఇద్ద‌రు మిత్రులు ఈత‌కు వెళ్ల‌గా.. అక్క‌డే మృతి చెందారు. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న తెలంగాణ‌లోని హ‌న్మ‌కొండ జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. హన్మ‌కొండ జిల్లాలోని హ‌స‌న్ ప‌ర్తి మండ‌లంలానికి చెందిన ఐదుగురు స్నేహితులు క‌లిసి నూత‌న సంవ‌త్స‌రం సెలబ్రేష‌న్స్ లో భాగంగా మ‌ద్యం సేవించారు. దీని త‌ర్వాత ధ‌ర్మ సాగ‌ర్ మండ‌లం ర‌ప‌క ప‌ల్లె గ్రామానికి చెందిన వాసుకుల ఆకాశ్, భూపాల ప‌ల్లి మండ‌లం చెల్పూర్ కె చెందిన శ్రీ‌క‌ర్ ఒక కుంట‌లో ఈత కొట్టేందుకు వెళ్లారు.

కుంట‌లో ఈతకు దిగ‌న త‌ర్వాత ప్ర‌మాద‌వ శాత్తు నీటిలో మునిగి పోయారు. దీంతో ఆకాశ్, శ్రీ‌క‌ర్ ఆ కుంట‌లోనే మృతి చెందారు. దీంతో మిగిలిన ముగ్గురు మిత్రులు అక్క‌డ నుంచి ప‌రార‌య్యారు. అయితే అక్క‌డే ఉన్న స్థానికుల స‌మాచారంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత దేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు. కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version