మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హ‌త్య కుట్ర కేసులో ట్విస్టు .. పోలీస్ క‌స్ట‌డిలో నిందితులు

-

తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హ‌త్యకు కొంత మంది కుట్ర చేసిన విషయం తెలిసిందే. కాగ ఈ కుట్రను తెలంగాణ పోలీసులు భ‌గ్నం చేశారు. కాగ ఈ కేసులు మేడ్చ‌ల్ జిల్లా కోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ హ‌త్య కుట్ర కేసుతో సంబంధం ఉన్న ఏడుగురు నిందితుల‌ను పోలీసులు కస్డ‌డి లోకి తీసుకోవడానికి మేడ్చ‌ల్ జిల్లా కోర్టు అనుమ‌తి ఇచ్చింది. కాగ ఈ హ‌త్య కుట్ర కేసులో ఉన్న ఏడుగురు నిందితుల‌ను పోలీసులు.. 10 రోజుల పాటు క‌స్ట‌డి ఇవ్వాల‌ని కోర్టును కోరారు.

కానీ పోలీసుల 10 రోజుల క‌స్డ‌డిని కోర్టు తీరస్క‌రించింది. కానీ 4 రోజుల పాటు క‌స్ట‌డికి అనుమ‌తి ఇచ్చింది. దీంతో బ‌షీరాబాద్ పోలీసులు ఈ ఏడుగురు నిందితుల‌ను విచారించ‌నున్నారు. కాగ ఈ నిందితుల‌ను.. బ‌షీరాబాద్ పోలీసులు వీడియో రికార్డింగ్ ద్వారా విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు. అనంత‌రం ఆ వీడియోను కోర్టులో ప్రవేశ పెడుతారు. కాగ ఈ హ‌త్య కుట్ర కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచార‌ణ చేప‌డుతున్నారు. అలాగే ఈ కేసులో ఇంకా ఎవ‌రైనా పాల్గొన్నారా.. అని కూడా పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version