పాకిస్తాన్ మ్యాచ్ లో కోహ్లీ ఫ్యాన్స్ హల్చల్…. 71 వసెంచరీ పాక్ లో చేయాలంటూ…

-

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు. ఇందుకు పాకిస్తాన్ మినహాయింపు కాదు. అక్కడ కూడా కోహ్లీకి హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడున్న పాక్ క్రికెట్ టీంలో కూడా విరాట్ కోహ్లీకి అభిమానుల ఉన్నారు. కోహ్లీకి ఒక్కసారైనా బౌలింగ్ చేయాలనుకునే పాక్ బౌలర్లు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే పాక్, భారత్ మ్యాచ్ లు జరగాలని ప్రతీ ఒక్క క్రికెట్ అభిమాని కోరుకుంటారు. కానీ పాకిస్తాన్ తీరు వల్ల దాయాది దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నమెంట్లలోనే తలపడుతున్నాయి. 

ఇదిలా ఉంటే తాజాగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీ ఫ్యాన్స్ హల్చల్ చేశారు. రావల్పిండి వేదికగా… పాక్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్ట్ లో పాకిస్తాన్ లోని కోహ్లీ ఫ్యాన్ బ్యానర్ పట్టుకుని తన అభిమానాన్ని చాటుకున్నారు. ‘‘ కోహ్లీ 71వ సెంచరీ పాకిస్తాన్ లో చేయాలి’’ అంటూ బ్యానెర్లు ప్రదర్శించారు. రావల్పిండిలోని మరో అభిమాని ‘బిగ్గెస్ట్ మ్యాచ్ 23 అక్టోబర్ 2022. పాకిస్థాన్ వర్సెస్ ఇండియా (T20WC)’’ అని రాసి ఉన్న బ్యానర్‌తో కనిపించాడు. ‘‘రోహిత్ వర్సెస్ షాహీన్.’’ అంటూ బ్యానర్ ప్రదర్శించారు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్, ఇండియా మరోసారి తలబడబోతున్నాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version