జీన్స్ ప్యాంట్ వద్దన్నందుకు భర్తను హతమార్చిన భార్య

-

ఆధునికతకు అనుగుణంగా, సంప్రదాయ దుస్తులకు విరుద్ధంగా భార్య జీన్స్ ప్యాంటు, టీ షర్టు ధరించిందని మందలించినందుకు కట్టుకున్న భార్య, భర్తను కడతేర్చింది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్లోని జోర్బితా అనే గ్రామంలో తుడు, పుష్పా అన్ ఇద్దరు దంపతులు ఉన్నారు. భార్య పుష్ప జీన్స్ వేసుకోవడం తుడుకు నచ్చదు. గత శనివారం రాత్రి ఆమె గోపాల్ పూర్ లో జరిగిన ఓ ఫెయిర్ కు జీన్స్ ధరించి వెళ్ళింది. ఆమె తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత జీన్స్ వేసుకోవడం పై దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.

 

పెళ్లి తర్వాత ఇలాంటివి వద్దని భర్త వారించాడు. దీంతో తీవ్ర అసహనానికి లోనైనా పుష్ప తన భర్తపై కత్తితో దాడి చేసింది. తీవ్రగాయాల పాలైన తుడుని కుటుంబ సభ్యులు వెంటనే అందుబాటులో ఉన్న పిఎంసిహెచ్ హాస్పిటల్ కి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుడు తుది శ్వాస విడిచాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version