యూనివర్సిటీ ట్యాంకులో మహిళ మృతదేహం..!

-

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా దారుణం జరిగింది. గౌతమ్ బుద్దా అనే యూనివర్సిటిలోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలో వాటర్ ట్యాంక్ లో ఓ మహిళా మృతదేహం దొరకడం కలకలం రేపింది. ఇది చూసి షాకైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకోని విచారణ చేపట్టారు. అయితే ఆ మహిళ.. తన భర్త, అత్తతో పాటు అక్కడే ఉంటున్నట్లు పోలీసుల విచారణలో బయపడింది.

ఆ మహిళ భర్త, అత్త కలిసి ఆమెను హత్య చేసి పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మహిళ భర్త దగ్గర్లో ఉన్న ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు తెలిసింది. అలాగే దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవని అక్కడి స్థానికులు పోలీసులకు తెలిపారు. అంతేకాదు  రాత్రి సమయంలో కూడా గొడవ జరిగిందని చెప్పారు. ఆ గొడవ జరగడంతోనే మహిళను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మృతురాలి భర్త, అత్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version