బీసీల దమ్ము ఏంటో చూపిస్తాం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

-

BCల దమ్ము ఏంటో చూపిస్తాం.. అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చేవెళ్ళలో బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ బలహీన వర్గాలకు చెందిన హేరన్నారు. 30, 40 యేండ్ల నుంచి బీసీ హక్కుల కోసం పోరాడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ మాత్రమే చేవెళ్లలో బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చిందన్నారు. బీసీలను కించపరుస్తూ కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి వీడియో పెట్టారని ఫైర్ అయ్యారు. దీన్ని బీసీలు సవాల్గా తీసుకోవాలన్నారు. దమ్ముంటే బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలని మోహన్ రెడ్డి సవాల్ చేశారని.. డబ్బులకు బీసీలు లొంగుతారని ఆయన దుర్మార్గంగా మాట్లాడారన్నారు. మోహన్ రెడ్డి కుల దురహంకారాన్ని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇంతవరకు ఖండించలేదన్నారు. బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి.. నిద్ర పోతున్నాయా ? అని ప్రశ్నించారు.

బీసీ సంఘాలు నిద్ర లేవాలి .. ఇంటింటికి వెళ్లి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకునేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. చేవెళ్ల సీటును బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. బీసీల దమ్ము ఏమిటో చూపిస్తామన్నారు. పార్టీల కతీతంగా కాసానికి మద్దతు తెలిపేందుకు అన్ని వర్గాలు ముందుకు వస్తున్నాయన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండిస్తున్నా అని క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version