రాజకీయాల్లో విమర్శలు అవసరమే : ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్

-

వైసీపీ అరాచక పాలన కారణంగా ఆంధ్ర ప్రదేశ్ అన్ని రకాలుగా వెనుకబడిందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తాము సంపద సృష్టిస్తున్నామని..అందుకే అమరావతి చుట్టూ రహదారుల నిర్మాణం వేగంగా చేపట్టామని అన్నారు. సంపద సృష్టికి కొంత సమయం పడుతుందన్నారు. జీతాలు ఇవ్వాలి కాబట్టే కొంత అప్పులు తీసుకోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు.

ప్రజాతీర్పుపై ఆత్మవిమర్శ చేసుకోకుండా వ్యవహరిస్తున్నారు అని విమర్శించారు. స్టాండర్డ్ ప్రొటోకాల్ ప్రకారం సీజనల్ వ్యాధుల గురించి ఏప్రిల్ నెల నుంచే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.మేం అధికారంలోకి వచ్చింది జూన్ నెలలో. వారు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. మేము అధికారంలోకి వచ్చాక ఉదాసీనత లేకుండా పనిచేస్తున్నాం అని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ జింక్ ట్యాబ్లెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తున్నాం అని సత్య కుమార్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సంక్షేమం అసాధ్యం. అయినా సరే సంక్షేమం, అభివృద్ధి – రెండూ చేస్తున్నాం. నాలుగు సంవత్సరాలుగా సుగాలి ప్రీతి కేసులో ఏమీ చేయకుండా, ఇప్పుడొచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అని మండిపడ్డారు.రాజకీయాల్లో విమర్శలు అవసరమే. నిర్మాణాత్మకంగా అవి ఉండాలి. గతంలో విమర్శలు చేస్తే ఎలా కేసులు పెట్టారు? ఎలా వేధించారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.మీ పనుల కారణంగా ప్రజలు ఇలాంటి తీర్పునిచ్చారు అని అన్నారు.సుగాలి ప్రీతి కేసుకు సమాధానం చెబుతాం. అలాగే గొడ్డలి పోటుకు కూడా సమాధానం చెబుతాం” అని మంత్రి సత్యకుమార్ అన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version