తల్లిదండ్రులు అందరూ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో ఆలోచిస్తారు. ముఖ్యంగా వారి క్రమశిక్షణ బాగుండాలని కోరుకుంటారు. కాకపోతే, అందరూ పిల్లలు ఒకే విధంగా ప్రవర్తించరు. ముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు పెద్దవారికి గౌరవం ఇవ్వరు. దానివలన అదే అలవాటుగా మారుతుంది మరియు భవిష్యత్తులో వారి ప్రవర్తన మారిపోతుంది. ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రుల మాటను వినడం మరియు గౌరవించడం వంటివి చేస్తారో, వారి భవిష్యత్తు బాగుంటుంది మరియు తల్లిదండ్రులతో సంబంధం కూడా బలంగా ఉంటుంది.
సహజంగా, పిల్లల ఎదుగుదల మరియు వయసు వలన వారి ప్రవర్తన మారుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రులు హద్దులు పెట్టకపోవడం వలన ప్రవర్తనలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. కనుక, పిల్లల ప్రవర్తనలో మార్పులు వచ్చే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో మాట్లాడేటప్పుడు ఎంతో ప్రశాంతంగా వ్యవహరించాలి. ఎప్పుడైతే పిల్లలతో ఉండే హద్దులను నిర్ణయించాలని ప్రయత్నిస్తారో, వారిని అస్సలు తిట్టకూడదు లేక అరుస్తూ మాట్లాడకూడదు. ఇలా చేయడం వలన మీ మాట వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కుటుంబానికి ఎప్పుడైతే గౌరవాన్ని ఇస్తారో, వారి ప్రవర్తన ఎంతో బాగుంటుంది.
కనుక పిల్లల ప్రవర్తనలో మార్పులు వచ్చినప్పుడు మరియు గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నప్పుడు దాన్ని వెంటనే పరిష్కరించాలి. కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే కాకుండా అందరితో గౌరవంగా వ్యవహరించాలి అని నేర్పించాలి. ఈ విధంగా చెప్పిన మాటలు విన్న తర్వాత వారిని ప్రశంసించాలి. ఇలా చేయడం వలన అదే ప్రవర్తన ప్రతిసారి కనిపిస్తుంది. దీంతో వారి ప్రవర్తన ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా గౌరవం అనేది పరస్పరంగా ఉండాలి, ఇతరులతో మనం గౌరవంగా మాట్లాడితే మనకి గౌరవం దక్కుతుంది అనేది నేర్పించాలి. ఈ విధంగా పిల్లలకు అవగాహన కల్పించడం వలన వారి ప్రవర్తన ఎంతో బాగుంటుంది.