సీఎం చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించినందుకు ఆర్డీఓ దేవేందర్ రెడ్డిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. శనివారం వనం – మనం కార్యక్రమంలో భాగంగా కడప యోగి వేమన యూనివర్సిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హరికిరణ్.. ఆర్డీఓ దేవేందర్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్త చేసి ఆయన్ని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వూలు జారీచేశారు. జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్నకు కడప ఇన్ ఛార్జ్ ఆర్డీఓగా బాధ్యతలు అప్పగించారు.