ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష విధించిన హైకోర్టు

-

అధికారం ఉందనే అహంకారంతో రిటైర్డ్ ఉద్యోగిని జైలుకు పంపిన ఐఏఎస్ అధికారికి 30 రోజు జైలు శిక్ష.. రూ. 2 వేల జరిమాన విధిస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

మహబూబ్ నగర్ కు చెందిన బుచ్చయ్య అనే మాజీ ప్రభుత్వ ఉద్యోగి తన స్థలంలో ఓ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అక్రమ నిర్మాణమని చేపడుతున్నారని కొందరు స్థానికులు జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న శివకుమార్ నాయుడికి ఫిర్యాదు చేశారు. దీంతో కిందటేడాది జూలై 1న ఆయన నిర్మాణంపై కోర్టు స్టే విధించింది. తనకు న్యాయం చేయాలని హైకోర్టుని ఆశ్రయించిన బుచ్చయ్యకు 2017 ఆగస్టు 29న స్టే ఆర్డర్ ని కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో బుచ్చయ్య పై ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన జాయింట్ కలెక్టర్ స్థానిక సీఐని ఆదేశించగా ఆయనపై అక్రమ కేసు బనాయించి దాదాపు రెండు నెలల 29 రోజుల పాటు జైళ్లో ఉంచారు. ఇదే విషయమై బుచ్చయ్య తరఫు న్యాయవాదులు వాస్తవాలతో కూడిన వాదనలు జడ్జికి వినిపించారు. కేసుని పరిశీలించిన హైకోర్టు జడ్జి జస్టిస్ పి.నవీన్ కుమార్ జాయింట్ కలెక్టర్ కు 30 రోజుల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా, బుచ్చయ్యకు నష్టం పరిహారం కింద  రూ.50 వేలు చెల్లించాలని తీర్పు వెలువరించింది. జడ్జీ తీర్పుతో న్యాయవ్యవస్థపై మరింత గౌరవం పెరిగిందని బుచ్చయ్య, ఇతరులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news