కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూను జూన్ 20 వరకు పొడిగించింది జగన్ సర్కార్. అయితే జూన్ 10 తర్వాత కర్ఫ్యూ సడలింపు సమయం పొడగిస్తున్నట్లు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం.. ఉదయం 6 గంటల నుంచి పగలు 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉండనుంది. అటు ఉ.8 గంటల నుంచి మ.2 గంటల వరకు అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయనున్నాయి.
కాగా ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా ఏపీ కరోనా బులిటెన్ ప్రకారంరాష్ట్రంలో కొత్తగా 8976 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1758339 కు చేరుకుంది. ఇందులో 16,09,879 మంది కోలుకోని డిశ్చార్జ్ కాగా 1,23,426 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 90 మంది మృతి చెందారు.దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 11466 మంది మృతి చెందారు.