అప్పుడెప్పుడో అగ్గిపెట్టె లో చీర పట్టేదంటే ఔరా అనుకున్నారు బ్రిటిష్ వారు, సరిగ్గా ఇలాంటి క్యూట్ ఆలోచనే చేశాడు మురద్ అలం. ఇంతకీ ఏం చేశాడు అనుకుంటున్నారా. ఇంతకు అతను ఎవరు అనుకుంటున్నారా…? అయితే ఈ స్టోరీ చదవండి. మురద్ ఆలం చేసిన పని చూసి కస్టమ్స్ అధికారులు ఆశ్చర్యపోయారు. వేరుశనగ కాయల్లో వేరుశనగ గింజలను తీసేసి దారంతో,
విదేశీ కరెన్సీ నోట్లను చుట్టి తీసుకొనివచ్చిన మురద్ అలం ను చూసి కస్టమ్స్ అధికారులు షాక్ అయ్యారు. కొందరు దళారులు బంగారాన్ని, విదేశీ కరెన్సీని తరలించటానికి చేసే ఆలోచనలు కస్టమ్స్ అధికారులను షాక్ కు గురి చేస్తున్నాయి. ఢిల్లీ విమానశ్రయంలో 45 లక్షల రూపాయల విలువ గల విదేశీ కరెన్సీని వేరుశనగకాయల్లో పెట్టీ తెచ్చిన తీరు చూసి షాక్ అవ్వడం కస్టమ్స్ అధికారుల వంతయింది.
వివరాలలోకి వెళితే ఢిల్లీ విమానశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది చేసిన తనిఖీలలో మురద్ అలం అనే వ్యక్తి అక్రమంగా విదేశీ కరెన్సీని తీసుకొనిరావటాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వేరుశనగ కాయల్లో వేరుశనగ గింజలను తీసేసి దారంతో విదేశీ కరెన్సీ నోట్లను చుట్టి తీసుకొనివచ్చిన మురద్ అలం కొంచెం అనుమానాస్పదంగా కనిపించటంతో సిబ్బంది క్షుణ్ణంగా అతనిని తనిఖీ చేశారు. దుబాయ్ నుండి ఢిల్లీకి అక్రమంగా విదేశీ కరెన్సీని తీసుకొనివస్తూ మురద్ అలం పట్టుబట్టాడు. కస్టమ్స్ అధికారులు మురద్ అలంను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.