ఎన్డీయేలోకి వైసీపీ… తెర‌వెన‌క మాస్ట‌ర్ ప్లాన్లే ఇవేనా…!

-

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేం. నిన్న‌టి బోడి మ‌ల్ల‌య్య‌లే నేటి ఓడ మ‌ల్ల‌య్య‌లు అవు తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఏపీలోనూ, ఢిల్లీలోనూ రాజ‌కీయాలు ఇలానే న‌డుస్తున్నాయ‌నే వార్త‌లు వ‌స్తున్నా యి. వైసీపీ ఏర్పాటు చేసిన త‌ర్వాత జ‌గ‌న్ వైఖ‌రిని గ‌మ‌నిస్తే.. జాతీయ రాజ‌కీయాల్లో ఆయ‌న బీజేపీకి మాత్ర మే అనుకూలంగాఉంటున్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తుంది. కాంగ్రెస్ ఎంత బ‌ల‌హీనంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న దానిని శ‌త్రువుగానే చూస్తున్నారు.

త‌న‌పై కేసులు పెట్టి, కోర్టుకు ఈ డ్చింద‌నే ప్ర‌ధాన అక్క‌సుతో పాటు రాజ‌కీయంగా త‌న‌ను ఎద‌గ‌కుండా చేసేందుకు కాంగ్రెస్ అనేక ప్ర‌య‌త్నాలు చేసింద‌నే ఆవేద‌న కూడా జ‌గ‌న్ లో ఉంది. ఈ కార‌ణంగానే జ‌గ‌న్‌.. కాంగ్రెస్‌కు ద‌క్క‌ర‌కాలేక పోయారు.. భ‌విష్య‌త్తులోనూ అయ్యే అవ‌కాశం లేదు. అయి తే, అలాగ‌ని బీజేపీతో నేరుగా ఆయ‌న సంబంధాలు కొన‌సాగిస్తున్నారా? అంటే అది కూడా క‌నిపించ‌దు. కానీ, ప‌రోక్షంగా చూసుకుంటే.. మాత్రం జ‌గ‌న్ వ్యూహం మేర‌కు ఆయ‌న‌కు బీజేపీకి మాత్ర‌మే అనుకూలంగా ఉండే అవ‌కాశం ఉంది.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మయంలోనూ నేరుగా వెళ్లి ఢిల్లీలో మోడీకి మ‌ద్ద‌తిచ్చారు. అడిగారో.. అడ‌గ‌లేదో.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక స‌మ‌యంలోనూ రామ్‌నాథ్ కోవింద్‌కు మ‌ద్ద‌తిచ్చా రు. ఇక‌, అనేక బిల్లుల విష‌యంలోనూ రాజ్య‌స‌భ‌లో మోడీ ప్ర‌భుత్వానికి జ‌గ‌న్ మ‌ద్ద‌తిచ్చారు. ఇటీవ‌ల ఎన్నార్సీ బిల్లు వంటి అత్యంత వివాదాస్ప‌ద బిల్లుకు కూడా స‌భ‌లో ఆయ‌న మ‌ద్ద‌తిచ్చారు. ఇక‌, ఇప్పుడు తాజాగా జ‌రుగుతున్న ప్ర‌చారం గురించి చూస్తే.. ఎన్‌డీఏలో చేరికకు వైసీసీ సిద్ధమైందన్న ప్రచారం జోరందుకుంది. వైసీపీపీ నేత విజయసాయిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కనుందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

మ‌రి ఇంది ఎంత‌వ‌ర‌కు నిజం? అనే ప్ర‌శ్న సాధారణంగానే తెర‌మీదికి వ‌స్తుంది. దీనిలోతుల్లోకి వెళ్తే.. జ‌గ‌న్ ఎప్పుడూ కూడా నేరుగా ఎన్డీయేతో క‌లిసే ప్ర‌య‌త్నం చేయ‌రని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇలా క‌లిస్తే.. అతి పెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలు, ద‌ళితులు ఆయ‌న‌కు దూర‌మ‌య్యే ప్ర‌మాదం ఉంది. అదేస‌మ‌యంలో రాష్ట్రంలోనూ ఆయ‌న వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో కేవ‌లం రెండు ప‌ద‌వుల కోసంఆశ‌ప‌డే వ్య‌క్తిత్వం ఆయ‌న‌కు లేదు. అయితే, ఎన్డీయేకు ఆయ‌న మ‌ద్ద‌త‌నేది ఇప్పుడే కాదు.. ఎప్ప‌టి నుంచో కొన‌సాగుతున్న విష‌య‌మే. సో.. ఈ విష‌యం క్లారిటీ ఇదే!

Read more RELATED
Recommended to you

Exit mobile version