తెలంగాణ ప్రజలకు సర్కార్ త్వరలో ఓ షాకింగ్ న్యూస్ చెప్పనుంది. తొందర్లోనే, కరెంట్ ఛార్జీలు పెంచేందుకు సిద్ధమవుతోంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 12న అసెంబ్లీలో గెజిట్ ప్రవేశపెట్టింది. అయితే తాజా రెగ్యులేషన్ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొని సర్కారు.
దీని ప్రకారం, ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు మోత మోగే అవకాశం ఉంది. రాష్ట్ర సర్కార్ ఈ ఆర్ సి చట్టంలో కొత్త నిబంధనను చేర్చింది. చట్టంలోని నిబంధనలకు మూడో సవరణ చేస్తూ కొత్త రెగ్యులరేషన్ చేర్చింది. కొత్త రెగ్యులేషన్ ప్రకారం, ప్రతి మూడు నెలలకు ఓసారి విద్యుత్ కొనే ధర, నష్టాలకు తగ్గట్టు యూనిట్ కు 30 పైసలు చొప్పున ఎఫ్ సిఏ ను వసూలు చేసుకునే స్వేచ్ఛను డిస్కములకు సర్కారు ఇచ్చింది.