ఏపీలో కరెంట్ కోతలు మొదలు..

-

దేశాన్ని కరెంట్ కష్టాలు, బొగ్గు కోరత సంక్షోభం తరుముకొస్తున్నాయి. ఇటీవల ఈ విషయమై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు. తాజాగా ఏపీలో కరెంట్ కోతలు మొదలుకానున్నాయి. ముందుగా డోమెస్టిక్ వినియోగదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే కరెంట్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ఈపీడీసీఎల్ సీఎండీ ప్రజలను కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కరెంట్ కోతలు ఉండే అవకాశం ఉంది. గ్రుహ అవసరాలకు కోసం కేవలం బల్బుల, ఫ్యాన్లు వాడాలని కోరుతున్నారు. పరిశ్రమలకు, వ్యవసాయానికి, పట్టణ ప్రాంతాలకు యథావిధిగా కరెంట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. బొగ్గు కొరత ఉండటంతో ఏపీలో మరో 20 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండనుంది. ఇవ్వాల్టి నుంచి ప్రకాశం జిల్లాలో అధికారికంగా కోతలు మొదలు కానున్నాయి. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో రూ.470 కోట్ల విద్యుత్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. బొగ్గు కోరత వల్లే కరెంట్ కష్టాలు ఏర్పడ్డాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఏపీ జెన్ కో కేంద్రాల్లో తగినంత బొగ్గు నిల్వలు లేనట్లు తెలుస్తోంది. ఎక్కువ ధరకు కరెంట్ కొంద్దామనుకున్నా తగినంత కరెంట్ అందుబాటులో లేదని ప్రభుత్వ చెబుతోంది. రానున్న మరో 3 నెలలు ఇదే పరిస్థితి నెలకొంటుందని ఏపీ అధికారులు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version