జనగామలో ఆర్టీసీ బస్సు బోల్తా.. డ్రైవర్ తో పాటు 12 మంది !

-

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు బోల్తా పడి డ్రైవర్ తో పాటు ఏకంగా పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం యన్.టి చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలం కొండాపూర్ మూలమలుపు వద్ద… ఓ బైక్ ను తప్పించబోయి… ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ తో పాటు ఏకంగా పది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి అని సమాచారం.

ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యంగా అడిగినప్పటికీ… బైక్ డ్రైవ్ చేసే వ్యక్తి కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. హుస్నాబాద్ నుంచి జగద్గిరిగుట్ట వైపు బస్సు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే… అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు లోంచి బయటకు పరుగులు తీశారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జనగామ జిల్లాలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ ఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version