కరివేపాకుతో సౌందర్య ప్రయోజనాలే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా..!!

-

కరివేపాకును మన భారతీయులు తమ వంటకాల్లో పూర్వం నుంచి ఎక్కువగా వాడుతారు.ఇది వంటల్లో వేయడం వలన మంచి రుచి, వాసన వస్తుంది. కరివేపాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఇనుము, ఫోలిక్ఆసిడ్, పీచు, జింక్, కాపర్ విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి. వీటి పోషక విలువల గురించి తెలియక చాలా మంది పెద్దవారు, పిల్లలు కరివేపాకును తీసి పడేస్తుంటారు. వారికి తెలియదు కరివేపాకు వలన ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజలున్నాయో. కరివేపాకు వల్ల అందం, ఆరోగ్యం మెరుగుపడుతుంది.దీని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం

జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలోనూ.. డయేరియాను నివారించడంలోనూ, కొలె స్ట్రాల్ ను తగ్గించడంలోనూ కరివేపాకు చక్కగా పనిచేస్తుంది.కరివేపాకును ఆహారంలో తీసుకుంటే జుట్టు రాలిపోకుండా చూసుకోవచ్చు. కరివేపాకుని ముద్దలా చేసుకుని తలకు పట్టించి అరగంట అయ్యాక తల స్నానం చేయాలి. ఇలా క్రమంగా చేస్తే జుట్టు పెరుగుతుంది.

ఇనుము, పోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఈ ఆకులను రోజు మనం తినే పదార్థాలలో ఏదో ఒకదానితో కలిపి తీసుకోగలగాలి. ఇది రక్తహీనతను దూరంగా ఉంచుతుంది. కరివేపాకులో చెక్కర స్థాయిలను తగ్గించే గుణాలు ఉన్నాయి. కరివేపాకులో ఐరన్,జింక్,కాపర్ తదితర పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇది క్లోమా గ్రంధిని ఉత్తేజితం చేస్తాయి. దీంతో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది .

కరివేపాకు మన శరీరంలో ఉండే కొవ్వును తగ్గించే గుణం ఉంది. ఇది బరువు పెరగకుండా శరీరాన్ని నియంత్రిస్తుంది. నిత్యం భోజనానికి ముందు కొన్ని కరివేపాకులను నమిలి తింటే శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది.కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మనం గుండెకు మేలు చేస్తాయి.

కరివేపాకులో యాంటీబ్యాక్టీరియాల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. జ్వరం, శ్వాసకోస సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version