ప్రస్తుతం ఇండియా వెస్ట్ ఇండీస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టెస్ట్ సిరీస్ ను ఇదని గెలుచుకుంది, ఇప్పుడు వన్ డే సిరీస్ లోనూ మొదటి మ్యాచ్ ను గెలుచుకుని సిరీస్ లో ముందంజలో ఉంది. కాగా ఈ రోజు రెండవ వన్ డే జరగనుంది. ఈ సండ్రహభంగా వెస్ట్ ఇండీస్ మాజీ ప్లేయర్ కర్ట్లీ ఆంబ్రోస్ ఇండియా లోని ఇద్దరు అతగలాలపై ప్రశంసల వర్షం కురిపించాడు. ముందుగా కోహ్లీ గురించి అంబ్రోస్ మాట్లాడుతూ… కోహ్లీ దూకుడుగా భారీ సిక్సులు కొట్టలేకపోయినా, స్కోర్ బోర్డును మాత్రం పరుగులు పెట్టించడంలో కోహ్లీ సిద్దహస్తుడన్నారు. ఇతని ఆట చూడడానికి కన్నుల పండుగగా ఉంటుందని పొగడతలతో ముంచెత్తారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ, క్రీజులో కొంచెం సేపు కుదురుకుంటే ఇక అతనిని ఆపడం ఎవరితరం కాదు. ఎప్పుడైనా విద్వంసాన్ని సృష్టించగల సత్తా అతని సొంతం అన్నారు అంబ్రోస్.
ఇంకా ప్రస్తుతం రెండు ఫార్మాట్ లలో ఇండియాను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న ఉత్తమ కెప్టెన్ అంటూ కొనియాడారు.