ప్రస్తుతం సంప్రదాయ వ్యవసాయం కంటే హార్టీకల్చర్ వ్యవసాయమే ఎక్కువ లాభాలను తెస్తుంది. చాలామంది రైతులు ఇదే మంచిదని నమ్ముతున్నారు. కొందరు రైతులతో ఈ వ్యవసాయంతో లాభాలు గడిస్తున్నారు. ఓ రైతు సీతాఫలం సాగుతో లక్షల్లో సంపాదిస్తున్నాడు. వింటర్ సీజన్ వచ్చిందంటే సీతాఫలాలు వచ్చేస్తాయ్. ఆ పేరు వింటుంటేనే అందరికి నోరు ఊరిపోతుంది. తింటే టేస్టిగా ఉంటుంది. సీతాఫలంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఈ పండు తింటం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రజలు వీటిని కొనటానికి ఎక్కువ ఆసక్తి చూపడంతో డిమాండ్ కూడా పెరిగింది.
బీపీని కంట్రోల్ చేసే శక్తి కూడా సీతాఫలాలకు ఉందట.. ఈ పండ్లలోని విటమిన్ A మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.కంటి చూపు కూడా మెరుగవుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు సీతాఫలం తింటే జీర్ణక్రియ బాగా అవుతుంది. ఈ ఫలంలోని కాపర్ మలబద్ధకాన్ని తరిమికొడుతుంది. డయేరియాకు చెక్ పెట్టే గుణం సీతాఫలానికి ఉంది. ఇలా చెప్పుకుంటే పోతే సీతాఫలాల ప్రయోజనాలు బోలెడున్నాయి.
లాభాలు అధికంగా రావడంతో చాలామంది రైతులు సీతాఫల్ పంట పండిస్తున్నారు. జన్వాల్ గ్రామానికి చెందిన బాలకృష్ణ తనకున్న ఆరు ఎకరాల్లో సీతాఫలం సాగు చేశాడు. 2019 నుంచి ఉత్పత్తి ప్రారంభమైందని చెప్పారు. అతను ఎకరానికి 2.5 లక్షలు సంపాదించినట్లు వెల్లడించారు.. 2 లక్షల ఖర్చుతో ప్రారంభించిన ఈ పంటతో నేడు 15 లక్షలకు పైగానే ఆర్జిస్తున్నాడంతే ఎంత మంచివిషయం. ఇప్పటి వరకు 40 లక్షల లాభం పొందారట.
మరాఠ్వాడాలోని ధరూర్, బాలాఘాట్ గ్రామాలు సీతాఫల్‌కు ప్రసిద్ధి. ప్రస్తుతం 25906 హెక్టార్ల విస్తీర్ణంలో విజయవంతంగా మొక్కలు నాటారు. ఆంధ్రప్రదేశ్‌లోని బాలానగర్ లేదా మముత్ జాతులు ఉత్పత్తి, నాణ్యత పరంగా మంచివిగా గుర్తించారు.ఈ పంటకు నీరు క్రమతప్పుకుండా కూడా ఏం అవసరం ఉండదు. వర్షపు నీటితోనే బంజరు భూమిలో సైతం ఇది పుష్కలంగా పండటంతో సొంతు భూములు ఉన్న రైతులు ఈ పంటను పండించేందుకు మొగ్గుచూపుతున్నారు.