కుక్కలను పెంచుకుంటే.. ఆరోగ్య లాభం..!

-

కుక్కను మించిన విశ్వాసమైన జంతువు లేదు. అందుకే చాలామంది కుక్కలు పెంచుకుంటారు. అయితే వీరిలో చాలావరకూ రక్షణ కోసం పెంచుకుంటారు. ఇంటికి కాపలా కోసం.. దొంగల భయం లేకుండా ఉండేందుకు కుక్కలను పెంచుకుంటారు. కానీ కుక్కల పెంపకం ద్వారా అంతకంటే.. ఎక్కువగా ఆరోగ్య లాభం ఉంటుంది.

స్వీడన్ కి చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశీలనలో ఇది స్పష్టమైంది. కుక్కల్ని పెంచుకోవడం వల్ల శారీరకంగానూ మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారని తేల్చింది. గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నవాళ్లు కూడా కుక్కల కారణంగా ఎక్కువ కాలం జీవిస్తారట.

ఈ పరిశోధన కోసం ఇరవై ఏళ్ల క్రితం గుండెజబ్బు బారినపడ్డ కొందరు వ్యక్తుల్ని ఎంపిక చేసి, వాళ్లలో కుక్కల్ని పెంచుకునే వాళ్లనీ పెంచని వాళ్లనీ విడదీసి లెక్కలు వేశారట. వాళ్లు ఎంతకాలం జీవించారనేది అధ్యయనం చేశారట. అందులో కుక్కల్ని కలిగి ఉన్నవాళ్లలో మరణాల సంఖ్య 33 శాతం తక్కువగా ఉందట.

అంతే కాదు, ఒంటరిగా జీవిస్తూ కుక్కల్ని పెంచుకునేవాళ్ల లో కూడా 15 శాతం మరణాల సంఖ్య తగ్గిందట. వీళ్లతో పోలిస్తే గుండెజబ్బు సోకిన వాళ్ల లో కుక్కలు లేనివాళ్లు త్వరగా మరణించడం జరిగిందట. అందుకే ఒంటరితనంతో బాధపడే వాళ్లతోబాటు హృద్రోగులు పెంపుడు కుక్కలు పెంచుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు పరిశోధకులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version