సైబర్ క్రైమ్.. పోలీసులమని పరిచయం చేసుకుని రూ.1.25 కోట్లు కొట్టేశారు

-

దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు.తాజాగా విజయవాడకు చెందిన ఓ యువతి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కింది. డ్రగ్స్ పేరిట వారు బెదిరింపులకు పాల్పడగా ఏకంగా రూ.1.25 కోట్లు పోగొట్టుకుంది. పూర్తి వివరాల్లోకివెళితే.. విజయవాడకు చెందిన యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌‌వేర్ జాబ్ చేస్తోంది. తన తల్లిదండ్రులకు చూసేందుకు గురువారం విజయవాడ వెళ్లింది.

ఈ క్రమంలోనే ఓ వ్యక్తి యువతికి ఫోన్ చేసి తాను ముంబై పోలీసునని పరిచయం చేసుకున్నాడు. మీ పేరిట ఒక పార్సిల్ వచ్చిందని, అందులో డ్రగ్స్, ఇతర నిషేధిత మత్తు పదార్థాలు ఉన్నాయని బెదిరించాడు. అది చట్టరీత్యా నేరమని, నిన్ను అరెస్టు చేయాల్సి ఉంటుందని భయపెట్టాడు. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే తనకు డబ్బులివ్వాలని బెదిరించాడు. కంగారు పడిపోయిన యువతి పలు దఫాలుగా ఆ కేటుగాడి అకౌంట్‌కు రూ.1.25 కోట్లు పంపింది. చివరగా తాను మోసపోయానని గ్రహించిన యువతి శుక్రవారం రాత్రి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news