ఏపీని వరుణుడు వదలడం లేదు. దక్షిణ అండమాన్ సముద్రంలో 29వ తేదీన అంటే రేపు… మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత 48 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తుంది. మరోవైపు శ్రీలంక తీర ప్రాంతం పై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో… రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో పలు చోట్ల ఆదివారం నుంచి రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలో 7 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరు ఊరు అలాగే కర్నూలు జిల్లాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవ వచ్చని సూచించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ రెండో తారీకు వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచనలు జారీ చేసింది అమరావతి వాతావరణ శాఖ.