చాతి నొప్పితో ఆస్ప‌త్రిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే..!

-

గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. రామ‌కృష్ణారెడ్డి నిన్న తాడేప‌ల్లి మంగ‌ళ‌గిరిలో అభివృద్ధి కార్యక్ర‌మాల‌కు హాజ‌ర‌య్యారు. అక్క‌డ రోజంతా ఫుల్ బిజీగా గ‌డిన ఆయ‌న‌కు తిరుగు ప్ర‌యాణంలో చాతిలో నొప్పిగా అనిపించ‌డంతో స్థానిక ఆస్ప‌త్రిలో చూపించుకున్నారు.

mangalagiri mla

డాక్ట‌ర్లు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించ‌డంతో అక్కడ నుండి గుంటూరులోని సాయి భాస్క‌ర్ ఆస్ప‌త్రిలో చేరారు. ఆయ‌న‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన డాక్ట‌ర్లు ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని…ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రంలేద‌ని చెప్పారు. అంతే కాకుండా ఆయ‌న‌కు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారు. దాంతో కుటుంబ స‌భ్యులు అనుచ‌రులు ఊపిరిపీల‌చ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version