తీరంవైపు వేగంగా దూసుకొస్తున్న దానా తుఫాన్.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

-

బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన దానా తుఫాన్ బలపడినట్లు ఐఎండీ తెలిపింది. మరికొన్ని గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుండగా.. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఒడిశా తీరం వైపు ఈ తుఫాన్ దూసుకొచ్చే అవకాశం ఉన్నది. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది.ఇప్పటికే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఐఎండీ అధికారులు హెచ్చరించారు.

గురువారం రాత్రి లేదా రేపు ఉదయానికి భిటర్‌కనిక నేషనల్ పార్క్ – ధామ్రా పోర్టుల మధ్య దానా తుఫాన్ తీరం దాటే చాన్స్ ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది.ప్రస్తుతం ఇది పారాదీప్‌కు 280 కి.మీ, ధామ్రాకు 310 కి.మీ దూరంలో.. సాగర్‌ ఐలాండ్‌కు 370 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర ఒడిశా, దక్షిణ బెంగాల్ తీరాలపై ఈ తుపాన్ తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపింది. మత్స్యకారులు, తీర ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news