గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే ఫ్యామిలీ కి చెందిన ఏకంగా తొమ్మిది మంది వలస కూలీలు మరణించారు. వీరందరినీ మధ్య ప్రదేశ్ వాసులుగా గుర్తించారు పోలీసులు. అయితే ఈ దారుణమైన ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇక ఘటన వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్ నుంచి గుజరాత్ వచ్చిన వలస కూలీలు అక్కడే స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. వీరంతా ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారు. అయితే.. శుక్రవారం రాత్రి ఇంట్లోని గ్యాస్ స్టౌ పేలడంతో ఈ ఏడుగురు కూలీలు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై మధ్య ప్రదేశ్ సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అలాగే.. ఆ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు పరిహారం కూడా ప్రకటించారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందిస్తామని తెలిపారు.