ఫార్ములా – ఈ కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఫార్ములా – ఈ కేసు విషయంలో ఏసీబీ తనపై కేసు నమోదు చేయడంపై హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్.
ఈ నేపథ్యంలో కేటీఆర్ కి బిగ్ షాక్ తగిలింది. ఇవాళ మధ్యాహ్నం జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు విచారణకు వచ్చిన ఈ పిటిషన్ ని హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసు పై హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ని న్యాయస్థానం తిరస్కరించింది. ఇక మరోవైపు తెలంగాణ భవన్ కి భారీగా పోలీసులు చేరుకుంటున్నారు.
ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఫార్ములా – ఈ రేస్ పై తెలంగాణ ఏసీబీకి లేఖ రాసింది. దాన కిషోర్ ఫిర్యాదు కాఫీని కూడా పంపాలని ఈడి ఆదేశాలు జారీ చేసింది.