కాంగ్రెస్ పార్టీ ముందు ఈ మూడు గ్యారెంటీలు ఇవ్వాలి : డీకే అరుణ

-

తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. తుక్కుగూడ విజయభేరి సభలో స్వయంగా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను వివరించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే వాటిని అమలు చేసి తీరతామన్నారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అయితే ఈ ఆరు గ్యారెంటీలపై బీఆర్ఎస్ అదిరిపోయే పంచ్ లు వేసింది. ఆరు గ్యారంటీలు కాదని, అసలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకో సీఎం తెరపైకి వస్తారని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. ఇప్పుడు బీజేపీ కూడా కాంగ్రెస్ గ్యారెంటీలపై సెటైర్లు పేలుస్తోంది. మాజీ మంత్రి డీకే అరుణ ఆరు గ్యారెంటీలను కామెడీ చేస్తూ కామెంట్లు చేశారు.

ఒకటి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారరని, రెండు కుంభకోణాలు చేయబోమని, మూడు తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టించబోమనే మూడు గ్యారెంటీలు ఇవ్వాలని నిలదీశారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు. కానీ కాంగ్రెస్, మిత్రపక్షాలు విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయిందన్నారు. కేసీఆర్ పైనా డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించే అలవాటు ముఖ్యమంత్రికి లేదన్నారు. బీఆర్ఎస్ కమిటీలలో ఎక్కడైనా మహిళలకు కీలక బాధ్యతలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో తన శ్రమ ఉందని, ఆ ప్రాజెక్టు కోసం తనను గౌరవించకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ తోడుదొంగలు అన్నారు. వీరు ముగ్గురు ఒకటై బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version