డైలాగ్ ఆఫ్ ద డే : జ‌గ‌న్-కు అమృతం దొరికిందా ?

-

త‌మ అధినేత కు చంద్ర‌బాబుకు తేడా చెబుతున్నారు ఏపీ మంత్రులు. త‌మ ప్రియ‌త‌మ నేత‌కు అమృతం దొరికితే అంద‌రికీ పంచుతారన్న విశ్వాసంతో ప్ర‌క‌ట‌న ఒక‌టి చేస్తున్నారు. 

ఇప్ప‌టిదాకా సంక్షేమ ప‌థ‌కాల అమలుతోనే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఆ రోజు చంద్ర‌బాబు కూడా ఇదే విధంగా ఆఖ‌రి నిమిషంలో భావించారు.  డ‌బ్బులు పంచితేనే సామాజిక న్యాయం అని చెబుతూ ఉన్నారు క‌దా ! ఇదెంత వ‌ర‌కూ సాధ్యం అని కూడా మంత్రులు ఆలోచించాలి. అలా అని ఆ రోజు అంటే టీడీపీ హ‌యాంలో త‌ప్పిదాలు జ‌ర‌గ‌లేదా ? జ‌రిగాయి. అవి వారికి శాపం లా మారాయి. ఇప్పుడు దిద్దుకోవాలంటే కుద‌ర‌దు. విధాన సంబంధ నిర్ణ‌యాలు మార్చుకోవాలంటే అది జ‌గ‌న్ తోనే సాధ్యం . ఎందుకంటే ఇప్పుడు అధికారం ఆయ‌న ద‌గ్గ‌ర ఉంది క‌నుక ! వీలున్నంత మేరకు సాధార‌ణ స్థాయిలో  అయినా కొన్ని మంచి ప‌నులు చేయాలి. రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్య‌వ‌స్థ పున‌రుద్ధ‌ర‌ణ లాంటివి చేస్తే ప‌ల్లెల‌కు కొన్ని ప‌నులు చేసేందుకు వీలు క‌ల్పిస్తే జ‌నం ఇంకాస్త పాల‌క ప‌క్షాన్ని వారు పంచే అమృతాన్ని విశ్వ‌సిస్తారు అన్న‌ది ఓ మాట. ప‌రిశీల‌కుల మాట. ఆర్థిక సూత్రాలకు అనుగుణంగా డ‌బ్బులు పంచ‌డం మేలు కాదు ఓ  రాష్ట్రం అధోగ‌తికి కార‌ణం. కానీ  తాము న‌మ్ముకున్న సూత్రాల‌కు అనుగుణంగా పాల‌న చేయాల‌న్న త‌లంపు ఒక‌టి అమృతం పంచాల‌న్న త‌ప‌న ఒక‌టి ఉన్నంత కాలం సంక్షేమం ఆగ‌దు. క‌నుక జ‌గ‌న్ ఈ సారి కూడా ఆ అమృతాన్నే న‌మ్ముకుంటున్నారు. ఇదే స‌మ‌యంలో చేదు నిజాల‌ను గుర్తించ‌డం మానుకుంటున్నారు.
ఇదీ ఆయ‌న విష‌య‌మై వ‌స్తున్న ప్ర‌ధాన విమ‌ర్శ. ఇదే అమృతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి ద‌క్కుతుంది. ..?

Read more RELATED
Recommended to you

Exit mobile version