గుడ్‌న్యూస్: ఈ ఫోన్ యూజర్ల కోసం కొత్త వాట్సాప్.. ఫీచర్లు ఇవే!!

-

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త వెర్షన్ తీసుకొస్తోంది. ఇప్పటివరకూ అండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు మాత్రమే తన సేవలను పరిమితం చేసిన సంస్థ.. ఇప్పుడు ఐప్యాడ్ యూజర్లకు కూడా తన సేవలు అందించనుంది. గతంలో ఐప్యాడ్ వినియోగదారులు తమ కోసం ప్రత్యేకంగా వాట్సాప్ ఉండాలని డిమాండ్ చేశారు. దీంతో మెటా యాజమాన్యం వాట్సాప్ ఐప్యాడ్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. అయితే గతంలోనూ వాట్సాప్ ఐప్యాడ్ యాప్ టెస్టింగ్ కూడా చేసినట్లు సమాచారం. కానీ ఇప్పటివరకూ ఆ టెస్టింగ్‌కు సంబంధించిన డేటాను నివేదించలేదు.

ఐప్యాడ్-వాట్సాప్

కాగా, వాట్సాప్ మల్టీ డివైస్ 2.0లో పని చేస్తోంది. ఐప్యాడ్ వినియోగదారుల డిమాండ్ మేరకు వాట్సాప్ కొత్త వెర్షన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. మల్టీ డివైజ్ సపోర్టు యూజర్లలో నాలుగు వేర్వేరు డివైజ్‌ల నుంచి ఒకే అకౌంట్‌లో లాగిన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే వాట్సాప్‌లో తన వినియోగదారులకు తమ రెండు వేర్వేరు ఫోన్లలో ఒకే అకౌంట్‌తో లాగిన్ అయ్యే అవకాశం లేదు. ఐప్యాడ్ యూజర్లకు యూప్ ఐప్యాడ్ వెర్షన్ స్క్రీన్‌షాట్ షేర్ చేసింది. వాట్సాప్ ఫీచర్‌లను ట్రాకింగ్ వెబ్‌సైట్ Wabetainfo ద్వారా మల్టీ డివైస్ 2.0ను అందిస్తోంది. భవిష్యత్‌లో ఐప్యాడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ డెస్క్ టాప్ వర్షన్, ఫోన్ వెర్షన్ తరహాలో ఫీచర్లను అందించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version