టిక్‌టాక్‌కు క్లోన్‌ ”జోష్”‌.. ”జోష్” చూపిస్తుందిగా.. 2 వారాల్లోనే 50 ల‌క్ష‌ల డౌన్‌లోడ్లు..!

-

దేశంలో టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయ‌డంతో టిక్‌టాక్ ప్రియులంద‌రూ ప్ర‌త్యామ్నాయ యాప్‌ల‌పై దృష్టి సారించారు. టిక్‌టాక్‌ను ఇక మ‌ళ్లీ అనుమ‌తిస్తారో, లేదోన‌ని చెప్పి చాలా మంది అలాంటి ఫీచ‌ర్స్ ఇస్తున్న ఇత‌ర యాప్‌ల వైపు మ‌ళ్లుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ న్యూస్ యాప్ డెయిలీ హంట్ డెవ‌ల‌ప్ చేసి అందుబాటులో ఉంచి జోష్ యాప్‌కు టిక్‌టాక్ ప్రియుల నుంచి ఆద‌ర‌ణ బాగానే ల‌భిస్తోంది. కేవ‌లం కొన్ని వారాల వ్య‌వ‌ధిలోనే కొన్ని ల‌క్ష‌ల మంది జోష్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాడ‌డం మొద‌లు పెట్టారు.

డెయిలీ హంట్ డెవ‌ల‌ప్ చేసిన జోష్ యాప్ టిక్‌టాక్‌లాగే 14 భాష‌ల్లో యూజ‌ర్ల‌కు అందుబాటులో ఉంది. సెన్సార్ ట‌వ‌ర్ డేటా చెబుతున్న ప్ర‌కారం.. జోష్ యాప్ కొన్ని రోజుల వ్య‌వ‌ధిలోనే 50 ల‌క్షల డౌన్‌లోడ్ల‌ను పూర్తి చేసుకుంది. ఈ యాప్‌ను జూలై 4వ తేదీన లాంచ్ చేశారు. అయితే టిక్‌టాక్‌కు పోటీగా ప‌లు ఇత‌ర యాప్‌ల‌ను అందుబాటులోకి తెచ్చినా.. కేవలం జోష్ యాప్ మాత్ర‌మే వాటికి దీటుగా ముందుకు సాగుతోంది. అందుకు ఆ యాప్‌కు న‌మోదవుతున్న డౌన్‌లోడ్లే నిదర్శ‌నం.

జోష్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇందులో టిక్‌టాక్‌లాగే ప‌లు కేట‌గిరిల‌ను అందుబాటులో ఉంచారు. యూజ‌ర్లు షార్ట్ వీడియోల‌ను పోస్ట్ చేసుకోవ‌చ్చు. ఇత‌రులు పోస్ట్ చేసిన వీడియోల‌ను వీక్షించ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version