గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు నృత్యప్రదర్శనతో డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణికి ఇతర అతిథులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థినులు డిప్యూటీ సీఎంను డ్యాన్స్ చేయాల్సిందిగా పట్టుబట్టారు. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విద్యార్థినులతో కలిసి నృత్యం చేశారు. ఒక పదినిమిషాలపాటు నృత్యం చేసి విద్యార్థుల్లో ఆనందం నింపారు.