పొరపాటు ఎక్కడ జరిగిందన్నది పక్కన పెడితే అమెజాన్ ఆన్ లైన్ పోర్టల్లో ఫోన్ బుక్ చేసిన ఓ పార్లమెంటు సభ్యునికి రాళ్లున్న బాక్స్ అందడంతో షాక్ గురయ్యారు. వివరాల్లోకి వెళితే…పశ్చిమబెంగాల్‌కు చెందిన ఎంపీ ఖాజెన్‌మూర్ము ఇటీవల శ్యామ్‌సంగ్ ఫోన్‌ను తన కొడుకు ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేయించాడు. అమెజాన్ నుంచి పార్శిల్ రావడంతో విప్పి చూశాడు.
బాక్స్‌పై రెడ్ మీ ఏ5 అని ఉండడంతో ‘తాను బుక్ చేసింది శ్యామ్‌సంగ్ ఫోన్ కదా’ అని కాసేపు ఆశ్చర్యపోయాడు. సరే చూద్దామని బాక్స్ విప్పి చూసిన ఎంపీకీ అందులోని వస్తువులు చూడగానే షాక్ తగిలింది. ఫోన్‌కు బదులు బాక్స్ లో రాళ్లున్నాయి. వెంటనే ఆయన అమెజాన్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు.