దేశంలోనే ఎక్కువ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర మొదటి స్థానం లో ఉంది. దేశంలో వైరస్ వచ్చిన నాటి నుండి మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుంది కానీ మరో పక్క మరణాలు కూడా అదే స్థాయిలో సంభవిస్తున్నాయి. కరోనా వైరస్ కట్టడి చేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అనేక విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే పనితనం ఏమీ బాగోలేదు అని ప్రతిపక్షాల నుండి విమర్శలు తారాస్థాయిలో వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే సీఎం పోస్టు ఊడిపోయేలా గండం వచ్చి పడింది.
ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా వైరస్ భయంకరంగా విస్తరిస్తూ ఉంది. ఇటువంటి టైం లో పార్టీకి సంబంధించిన వేరే వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఎలక్షన్ పెట్టడానికి… ఎన్నికల కమిషన్ ముందుకు రాదు. దీంతో కరోనా వైరస్ దెబ్బకీ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే పీఠం దద్దరిల్లుతోంది. మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితి చూస్తే మే లోపు ఉద్దవ్ ఠాక్రే సీఎం పీఠం ఊడిపోవడం గ్యారంటీ అని చాలామంది అంటున్నారు.