కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు లాక్ డౌన్ ని రెండు వారాలు పోడిగించాలి అని భావిస్తుంది. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ప్రధాని నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కూడా లాక్ డౌన్ ని ఎత్తివేయడం అనేది సాధ్యం కాదని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీని ఆధారంగా చూస్తే ఆయన రెండు వారాల వరకు లాక్ డౌన్ ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఈ రెండు వారాలు దేశానికి చాలా కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ ని ఎత్తివేస్తే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది వాస్తవం. కాబట్టి ప్రజలు ఎవరూ కూడా ఈ రెండు వారాలు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. సామాజిక దూరంలో ఏ మాత్రం తేడా వచ్చినా సరే దేశం ఎరుగని విపత్తు వచ్చే అవకాశం ఉందని, ఒక్కసారి గ్రామాల్లోకి కరోనా వెళ్తే ఎవరికి సాధ్యం కాదని,
ఇప్పుడు ఇటలీ, అమెరికా, స్పెయిన్… గ్రామాల్లోకి కరోనా వెళ్ళడం తోనే దాన్ని అదుపు చేయలేక అవస్థలు పడుతున్నారు. కరోనా అనేది చాలా ప్రమాదకరం అని అది ఏ రూపంలో వస్తుందో తెలియదు కాబట్టి లాక్ డౌన్ లో ఏమైనా మార్పులు వచ్చినా సరే ప్రజలు బయటకు రాకుండా ఉండటమే మంచిది అని సూచనలు చేస్తున్నారు. ఈ రెండు వారాలు చాలా జాగ్రత్తగా ఉంటే జీవితాలు సంతోషంగా ఉంటాయని అంటున్నారు.