తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సేలంలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ మహిళా ఉపాధ్యాయురాలిని రోడ్డు పక్కన డ్రాప్ చేసి వెళ్లే క్రమంలో..వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఆ ఉపాధ్యాయుడిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.యాక్సిడెంట్ అనంతరం కారు డ్రైవర్ ఆపకుండా అక్కడి నుంచి తప్పించుకున్నారు.ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే,ఇది ప్రమాదమా? లేక కుట్రకోణంలో జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.