మనం నివసిస్తున్న ఈ భూప్రపంచంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని కని పెట్టడం కోసం చాలా మంది శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్ళుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.ఇప్పటి వరకు మనిషి చాలా రహస్యాల గురించి పెద్దగా తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు మనం ఒక సరస్సుకి సంబంధించిన కొన్ని సీక్రెట్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
దక్షిణాఫ్రికాలోని లింపోపో ప్రావిన్స్‌లో ఉన్న ప్రమాదకరమైన సరస్సు. దీనిని ఫండూజీ సరస్సు అని పిలుస్తారు. ఈ సరస్సు నీటిని తాగిన వ్యక్తి ఇక మనుగడ సాగించడని చెబుతారు. ఎలాగోలా బతికినా కొద్ది సేపటికే చనిపోతాడట. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పురాతన కాలంలో ఈ దారిలో వెళుతున్న ఒక కుష్ఠురోగికి ఇక్కడి ప్రజలు ఆహారం, బస ఏర్పాటు చేసేందుకు నిరాకరించారు. దీంతో అతను ఆ ప్రాంతం ప్రజలను శపించాడంటారు. ఇప్పటికీ అతని అరుపులు ఇక్కడ వినిపిస్తాయట. అతను ఆ సరస్సులోకి ప్రవేశించి అదృశ్యమయ్యాడట. సరస్సు లోపల నుండి తెల్లవారుజామున డ్రమ్ముకట్టిన శబ్దాలు వస్తాయని చెబుతారు.
అంతేకాదు జంతువులు,మనుషులు పెద్దగా అరిచినట్లు వినిపిస్తుందని అంటున్నారు.ఆ సరస్సు ను ఒక వింత జంతువు రక్షిస్తుందని ప్రజలు నమ్ముతున్నారు.అందుకే నదివైపు అస్సలు వెళ్ళారు. ఆ రోగిని సంతోష పెట్టాడానికి ప్రతి సంవత్సరం గిరిజనులు ఒక నృత్య ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో పెళ్లికాని అమ్మాయిలు నృత్యం చేస్తారు. పురాతన కాలంలో కొండచరియలు విరిగిపడటం వల్ల ముతాలి నది ప్రవాహానికి అడ్డుపడటం వల్ల ఈ సరస్సు ఏర్పడి ఉండవచ్చని చెబుతారు ఈ సరస్సు నీరు శుభ్రంగా ఉన్నప్పటికీ తాగిన వ్యక్తి ఎందుకు చనిపోతాడనేది ఇప్పుడు మిస్టరీగా మిగిలిపోయింది. ఈ సరస్సు నీటి రహస్యాన్ని తెలుసుకోవడానికి చాలాసార్లు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. కానీ ప్రతిసారీ వారు విఫలమయ్యారు. 1946లో ఆండీ లెవిన్ అనే వ్యక్తికి ఈ సరస్సులోని రహస్యం తెలిసిందని చెబుతారు.అతను సరస్సు నిజం గురించి జనాలకు చెప్పాలని వెళతాడు.దారి తప్పి చని పోతాడు దాంతో ఈ సరస్సు స్టోరీ మిస్టరీగానే ఉండిపోయింది.