ఆ విషయమై ఆలోచనలో ప్రియాంకా మోహన్..నచ్చావ్ అంటున్న కీర్తిసురేశ్

-

నేచురల్ స్టార్ నాని ‘‘గ్యాంగ్ లీడర్’’ మూవీలో తన నటనతో హోమ్లీ గా కనిపించి అందరి చూపులను తన వైపునకు తిప్పుకుంది ముద్దుగుమ్మ ప్రియాంకా అరుల్ మోహన్. ఇక ఆ తర్వాత ‘వస్తానంటివో పోతానంటివో ’ఫోక్ సాంగ్ లో పక్కా పల్లెటూరు అమ్మాయిలా కనిపించింది ఈ వగలాడి భామ.

కళ్లతోనే హావభావాలు పలికించే నటన తన సొంతం అని నిరూపించుకుంది ఈ సుందరి. సోషల్ మీడియాలోనూ ఈ భామ యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ సోషల్ మీడియా వేదికగా ఇచ్చేస్తుంటుంది.

లేటెస్ట్ గా ఇన్ స్టా గ్రామ్ లో ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్న ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలా ఉన్న ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘కెరీర్ గురించి ఆలోచిస్తున్నావా?’’ అని ప్రశ్నిస్తున్నారు. క్యూట్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  ఈ ఫొటోలను ‘మహానటి’ కీర్తి సురేశ్ లైక్ చేయడం విశేషం. ప్రియాంకా మోహన్.. శివ కార్తీకేయతో కలిసి నటించిన ‘డాన్ ’ఫిల్మ్ ఈ నెల 13న విడుదలైంది. ఈ చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version