Das ka Dhamki : విశ్వక్ సేన్ “ధమ్కీ” రిలీజ్ డేట్ ఫిక్స్

-

యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ‘దాస్ కా దమ్కీ’ మూవీ చేస్తున్నాడు. కామెడీ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్నకుమార్ కథని సమకూరుస్తున్నాడు. నివేదా పేతురాజు మరోసారి విశ్వక్ తో కలిసి నటించబోతుంది.

అయితే, విశ్వక్సేన్ నటించిన ‘దాస్ కా దమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 17న నిర్వహించేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావా ల్సి ఉంది. ఇక తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ ను అనౌన్స్‌ చేశారు. ఈ నెల 22న ఈ సినిమా ను రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Exit mobile version