Dasara : నాని “దసరా” రిలీజ్‌ డేట్‌ ఫిక్స్..ఎట్లైతే గట్లయే చూసుకుందాం

-

నేచురల్ స్టార్ నాని ఇటీవల ‘అంటే సుందరానికీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. జనాలను ఎంటర్ టైన్ చేయడంలో ఎప్పుడు ముందుండే నాని ఈ సినిమా ద్వారా కూడా ఎంటర్ టైన్ చేశాడు. ఇక ఇప్పుడు నాని తన నెక్స్ట్ ఫిల్మ్ ‘దసరా’పైన ఫుల్ ఫోకస్ పెట్టేశాడని తెలుస్తోంది. సింగ‌రేణి బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ‘మహానటి’ కీర్తి సురేశ్ ఇందులో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ పిక్చర్ షూటింగ్ 30 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరలో ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ మూవీకి సంతోష్ నారాయ‌ణ‌న్‌, సత్యన్ సూర్యన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక తాజాగా ఇవాళ ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం. ఈ మూవీని మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నాని ఊర మాస్‌ పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌ లో నాని.. హాట్‌ బ్యూటీ.. సిల్క్‌ స్మితా ముందు కూర్చుని కనిపించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version