దర్శకుడు దాసరి నారాయణరావు గారు ఈ పేరును ఎవరికి పరిచయం చేయవలసిన అవసరం లేదు.. ఎన్నో మంచి మంచి సినిమాలను నిర్మించడమే కాదు.. అందులో కన్నీరు పెట్టించే పాత్రలను కూడా పోషించి, మధ్యతరగతి జీవితాలకు చాలా దగ్గరయ్యారు.. ఆయన పోషించిన పాత్రల్లో ఎక్కువగా పేదలు తమ జీవితాల్లో పడే కష్టాలు, ఆస్దిగొడవలు, కుటుంబంలోని భార్యభర్తల బంధాల మధ్య ఉన్న కన్నీటిని కళ్లకు కట్టినట్లుగా చూపించేవారు.. కన్నీరు పెట్టేలా నటించే వారు.. ఇలాంటి దాసరి గారింట్లో ఇప్పుడు ఆస్దిగొడవలు మొదలయ్యాయట..
ఈ విషయం దాసరి అరుణ్ కుమార్‌పై ఆయన సోదరుడు ప్రభు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో బయటకు వచ్చింది.. ఆయన ఇచ్చిన కంప్లైంట్ లో అరుణ్‌కుమార్ తమ ఇంటిపై దాడి చేశాడంటూ పేర్కొన్నారు.. ఫుల్‌గా మద్యం తాగిన అరుణ్ ఈనెల 24వ తేదీ రాత్రి గోడ దూకి తమ ఇంటిలోకి ప్రవేశించి, తండ్రి బీరువా తెరిచేందుకు ప్రయత్నించాడని ప్రభు తెలిపారు. ఇకపోతే తన తండ్రి వీలునామా ప్రకారం ఆ ఇల్లు తన కూతురికి చెందుతుందని, ఆస్తి కోసం తమపై దౌర్జన్యానికి పాల్పడిన అరుణ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభు డిమాండ్ చేశారు..
చూశారా మధ్యతరగతి జీవితాల్లోనే కాదు బాగా డబ్బు ఉన్న ఇంటి వారి బ్రతుల్లో కూడా ఆస్దిగొడవలు ఉంటాయని దీనిబట్టి అర్ధం అయ్యింది.. ఈ డబ్బు బంధాలను కలుపుతుంది, కలిసి ఉన్న బంధాలను విడగొడుతుంది.. రక్త సంబంధీకుల మధ్య చిచ్చు పెడుతుంది.. అందుకే డబ్బు ఎవరికి చేదు కాదు అంటారు మన పెద్దలు..