స‌మంత్ వెబ్ సిరీస్ కు డేట్ ఫిక్స్‌.. మ్యాజిక్ రిపీట్ చేస్తుందా!

-

ఈ మ‌ధ్య సినిమాల‌కు ఏ మాత్రం క్రేజ్ త‌గ్గ‌కుండా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌, ఫ్యామిలీ జాన‌ర్ ల‌లో వెబ్ సిరీస్ లు తెర‌క్కుతున్నాయి. స్టార్ హీరో, హీరోయిన్లు ఇందులో న‌టిస్తుండ‌టంతో వీటికి ఫుల్ క్రేజ్ వ‌చ్చేస్తోంది. ఇక స‌మంత న‌టించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ 2 పై ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఈ వెబ్ సిరీస్ అమేజాన్ ప్రైమ్ లో సూప‌ర్ హిట్ అయింది. అయితే దీన్ని స్ట్రీమింగ్ చేయ‌డానికి అదిగో, ఇదిగో అన్న‌ట్టు వాయిదా వేస్తూ వ‌చ్చారు మేక‌ర్స్‌. ఈ సిరీస్ గతేడాది చివర‌న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల నిలిపి వేశారు.

అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ వ‌చ్చేసింది. జూన్‌ మొదటి లేదా రెండో వారంలో దీన్ని స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు సంబంధించిన అధికారిక తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు యూట్యూబ్ లో ఏ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version