ఖర్జూరం తిని గింజలు పడేస్తున్నారా.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా.!

-

డేట్స్ అంటే ఇష్టపడని వాళ్లంటూ ఎవరూ ఉండరేమో కదా..ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇవి..వీటిని తిన్నాక అందరూ ఆ గింజలను పడేస్తుంటారు. కొందరైతే ఎవరు ఎంత దూరం విసిరిస్తేరా అని వాటితో ఆడుకుంటుంటారు. అంటే అందరూ ఆ గింజలను పారేస్తారే కానీ..వాటితో తిరిగి ఎలాంటి పని చేయరు. కానీ మీకు తెలుసా..ఖర్జూరం గింజల వలన కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయిని. ఈ ఖర్జూరం గింజలను అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారట. ఖర్జూరం గింజల పొడిలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, జింక్, కాడ్మియం, కాల్షియం , పొటాషియంతో కూడిన సమ్మేళనాలను కలిగి ఉంటుంది. అయితే ఈ గింజలను నేరుగా తినలేరు కనుక.. ఖర్జూరపు గింజల పొడిని ఉపయోగిస్తారు. ఖర్జూరం గింజలు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూసేద్దాం.!

ఖర్జూర గింజల వల్ల ఉపయోగాలేంటంటే..

వీటిల్లో ఉన్న యాంటీవైరల్ ఏజెంట్లు, మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినకుండా నిరోధించడానికి సహాయపడతాయట.
రక్తంలో చక్కెర సమస్యల చికిత్సలో బాగా ఉపయోగపడతాయి.
ఈ గింజలు DNA దెబ్బతినకుండా నిరోధిస్తాయి
జుట్టును ఒత్తుగా పెరిగేలా చేయడంలో పాటు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.
తెల్ల వెంట్రుకలను నిరోధిస్తుంది.

1. యాంటీఆక్సిడెంట్లు:

ఖర్జూరం విత్తనాల్లో అధికంగా యాంటీఆక్సిడెంట్లలున్నాయి.దీంతో యాంటీఆక్సిడెంట్ ఆరోగ్య మెరుగుదలకు వీటిని ఆహార పదార్ధంగా ఉపయోగించవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇరానియన్ ఖర్జూర విత్తనాలను ఔషధ, వ్యాపార అవసరాల కోసం సహజ యాంటీఆక్సిడెంట్లగా పరిగణిస్తారు.

2. షుగర్ పేషేంట్స్ కు :

ఖర్జూర విత్తనాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరం అంటున్నారు నిపుణులు. రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. ఈ ఖర్జూరం గింజల పొడి ఇన్సులిన్ ఉత్పత్తి లక్షణాలను కలిగి ఉంది. ఎవరైనా మధుమేహం వ్యాధి గ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉన్నట్లయితే, ఖర్జూరపు గింజల పొడిని ఒక వారం పాటు ప్రయత్నిస్తే.. మంచి ఫలితాలు పొందుతారట.

3. మూత్రపిండాల్లో రాళ్లు, కాలేయం దెబ్బతినకుండా చేస్తుంది

కిడ్నీలో రాళ్లు , మూత్రాశయ వ్యాధుల చికిత్సకు ఖర్జూర విత్తనాలు చక్కటి పరిష్కారమట. ఖర్జూరం అనేక ఔషధ సమ్మేళనాలను కలిగి ఉంది. కార్టికోస్టెరాయిడ్స్ వలె పనిచేస్తుంది. అందుకనే సాంప్రదాయ వైద్యం చేసేవారు మూత్రపిండాలు, మూత్రాశయ రుగ్మతలు, వాపు , అంటు వ్యాధుల చికిత్సకు ఖర్జూరం గింజలను ఉపయోగిస్తారు.

4. DNA దెబ్బతినకుండా నిరోధిస్తుంది:

ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి… ఇవి శరీరం యొక్క DNA నిర్మాణాన్ని సంరక్షిస్తాయి. అంతేకాదు ఖర్జూరాలు అనేక ఖనిజాలను ఉన్నాయి కనుక రోగనిరోధక వ్యవస్థ పెంపొందిస్తుంది.

5. ఖర్జూర విత్తనాలల్లో ఫైబర్

ఖర్జూరపు గింజలు డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఖర్జూరపు గింజల పొడి జీర్ణశయాంతర రుగ్మతలకు, ముఖ్యంగా దీర్ఘకాలిక విరేచనాలకు చికిత్సగా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించే బ్యాక్టీరియాను చంపుతుంది.

విత్తనాలను డైరెక్టుగా తినమంటే సాధ్యం అయ్యేపనికాదు..ఖర్జూర గింజలను వేగించి పొడిగా తయారుచేస్తారు.ఈ పొడిని కొంతమంది తమ కాఫీలో కలుపుకుని తాగితే.. మరికొందరు టీ లా తయారు చేసుకుని తాగుతారు. కొందరు స్మూతీల్లోనూ.. కేక్ పై టాపింగ్ కోసం ఈ ఖర్జూర గింజల పొడిని ఉపయోగిస్తారు.

కాబట్టి ఈసారి మీరు గింజలను పారేసేముందు ఇలా ట్రై చేసి చూడండి. జుట్టుకు కూడా మంచి ప్రయోజనం ఉంది కాబట్టి ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియోస్ చూసి ఫాలో అవ్వండి..సోషల్ మీడియాలో ఇలాంటి సమాచారానికి కొదవేం లేదుకదా.!

Read more RELATED
Recommended to you

Exit mobile version