ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కరోనా సోకిందని, అతని భార్య మహజబీన్ కూడా దాని బారిన పండిందని పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో దావూద్ పర్సనల్ బాడీ గార్డులు, ఇతర వ్యక్తిగత సిబ్బంది అందరినీ క్వారంటైన్‌కు పంపారు. అయితే ప్రస్తుతం కరాచీలోని మిలటరీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీంకు కరోనా వైరస్ చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది.