తమిళనాడులోని ఓ రైల్వే స్టేషన్‌లో సూట్ కేసులో మహిళ శవం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. నెల్లూరు, చైన్నై సెంట్రల్ మధ్య నడిచే సబర్మన్ ఎలక్ట్రికల్ ట్రైన్ మింజూర్ రైల్వే స్టేషన్‌కు రాగానే ఓ సూట్ కేసు ప్లాట్‌ఫాంపై పడింది. రైలు కదలడానికి కొన్ని సెకన్ల ముందే సూట్‌కేసును ప్లాట్ ఫామ్ మీదకు విసిరేశారు. గమనించిన కానిస్టేబుల్ మహేష్ ఈకేసులో తండ్రి, కూతురిని అరెస్టు చేశారు. సూట్‌కేసు నుంచి రక్తం కారడం చూసి దానిని తెరిచి చూడగా అందులో మహిళ మృతదేహం కనిపించింది.
ఆర్పీఎఫ్ సిబ్బంది తండ్రి,కూతురిని నిలదీయగా ఈ హత్య తామే చేసినట్లు ఒప్పుకున్నారు. తన కూతురును సదరు మహిళ వ్యభిచారంలోకి దించేందుకు యత్నించగా.. కోపంతో హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. మృతురాలిని మన్యం రమణిగా గుర్తించిన పోలీసులు.. చెన్నైలో నిందితుల ఇంటి సమీపంలోనే ఆమె ఉంటున్నట్లు వివరాలు రాబట్టారు. మహిళ మెడలో 50 గ్రాముల బంగారం ఉండగా.. నిందితులు దానిని అపహరించి కడ్డీలుగా మర్చారని విచారణలో తేలింది. నిందితులు నెల్లూరుకు చెందిన సుబ్రమణ్యం, కూతురు దివ్యశ్రీగా గుర్తించారు.