తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పెంపు

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ అలాగే ఈ బీసీ విద్యార్థుల ఉపకార వేతనాలు, బోధనా ఫీజుల దరఖాస్తు గడువు ఈనెల 31తో ముగుస్తుంది. ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులు దూరంగా ఉన్నారు. కరోనా కారణంగా 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల్లో జాప్యం చోటు చేసుకోవడం.. ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడం తదితర కారణాల వల్ల చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు.

ఇక ఈ ఏడాది కొత్తగా కోర్సుల్లో చేరిన వారు, అలాగే 2000 విద్యార్థులు కలిపి దాదాపు 12.6 లక్షల మంది విద్యార్థులు చేసుకుంటారని అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు కేవలం 9 లక్షల మంది మాత్రమే దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఉపకార వేతనాల దరఖాస్తు గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగించాలని ఎస్సీ సంక్షేమ శాఖ భావిస్తోంది. ఈ మేరకు గడువు పెంపునకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version