ముక్కుసూటితనం… హరి మావయ్య నైజం – నారా లోకేష్

-

ముక్కుసూటితనం హరి మావయ్య నైజం అని టీడీపీ అగ్రనేత నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఇవాళ.. టీడీపీ నేత, దివంగత హరికృష్ణ వర్దంతి. ఈ నేపథ్యంలోనే.. నారా లోకేష్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ముక్కుసూటితనం హరి మావయ్య నైజమని… తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం ఆయనకే ప్రత్యేకమైన వ్యక్తిత్వం అని ప్రశంసించారు.

రాజకీయాల్లోనూ, నటనలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హరి మావయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నానన్నారు. అటు చంద్రబాబు కూడా హరికృష్ణకు నివాళులు అర్పించారు.

మంచితనానికి, ఆప్యాయతకు రూపమిస్తే అది నందమూరి హరికృష్ణగారు. తండ్రి ఎన్టీఆర్ ఆదర్శాలను జవదాటని కొడుకుగా, చైతన్య రథసారథిగా, నటుడిగా… తెలుగు ప్రజలకు ఎంతో చేరువైన హరికృష్ణగారు… తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పార్టీకి, ప్రజలకు ఎంతోసేవ చేసారు. నందమూరి హరికృష్ణగారి వర్ధంతి సందర్భంగా ఆ సౌజన్యమూర్తి స్మృతికి నివాళులు అంటూ పేర్కొన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version