సంగారెడ్డి జిల్లా పేలుడు ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పేలుడు ఘటనలో 42కి మృతుల సంఖ్య చేరింది. ఇందులో మరో 42 మంది గాయపడగా, వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం అందుతోంది.

ఇంకా 27 మంది ఆచూకీ లభించలేదు. ఇక వాళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్.
ఇది ఇలా ఉండగా నేడు పాశమైలారం ప్రమాద ఘటనాస్థలానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు పాశమైలారం పారిశ్రామికవాడకు చేరుకుని పరిశీలించనున్నారు. సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగించేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తరఫున కమిటీ ఏర్పాటు చేశారు.