డిసెంబర్‌ 09 బుధవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

రాశిఫలాలు – కార్తీకమాసం- డిసెంబర్‌-9- బుధవారం.

మేషరాశి:అనుకోని మార్గాల ద్వారా ధనం !

ఈరోజు అనుకోని మార్గాల ద్వారా ధనం అందుతుంది. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి.  ఉద్యోగాలలో అనుకోని మార్పులు సంభవం. ఒక శుభవార్త మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. ఈ రోజు మీరు అపరిచితుల నుంచి మద్దతు పొందవచ్చు. ఈ రోజు మీరు పనిలో శ్రద్ధ పెట్టడం అవసరం. ఆకస్మిక ప్రయాణాలు.

పరిహారాలుః అనుకూలమైన శుభ ఫలితాల కోసం దుర్గాదేవిని ఎర్రని పూలతో పూజించండి,

todays horoscope

వృషభరాశి:తగాదాలకు దూరంగా ఉండండి !

తప్పుగా డబ్బు సంపాదించవద్దు. వీలైనంత వరకు అనవసర వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక, సమస్యలు వల్ల ఒత్తిడికి గురవుతారు. పాత స్నేహితులను కలుస్తారు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. ఈ రోజు మిత్రులతో అకారణంగా తగాదాలు. కొన్ని పనులు మధ్యలోనే విరమిస్తారుఆర్థిక ఇబ్బందులు. ఉద్యోగాల్లో  పనిభారం. వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి.

పరిహారాలుః అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి.

మిథునరాశి:ఈ రోజు మీకు గౌరవం పెరుగుతుంది !

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఊహించని లాభాలను అందుకుంటారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించండి. బంధువుల నుంచి ధనలాభం. ఆర్థిక లావాదేవీలలో పురోగతి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు అధిక లాభాలు. ఈ రోజు మీకు గౌరవం పెరుగుతుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఈ రోజు పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు.

పరిహారాలుః శని స్తోత్రం పారాయణం లేదా శనిగ్రహ ప్రదక్షణలు చేయండి.

కర్కాటకరాశి:మనస్సు చికాకు చెందుతుంది !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. కష్టపడిని పనిచేయడం వల్ల కావాల్సినంత ప్రయోజనం ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశముంది. మానసిక సమస్యల వల్ల మనస్సు చికాకు చెందుతుంది. ఈ రోజు కుటుంబంలో చికాకులు. ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

పరిహారాలుః గోసేవ చేయండి అనకూల ఫలితాలు వస్తాయి.

సింహరాశి:వ్యాపార రంగాల్లో మీ క్రెడిట్ పెరుగుతుంది !

ఈ రోజు అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో ఊహించని అవకాశాలు. ఖర్చులను నియంత్రించడం ముఖ్యం. వ్యాపారం, వ్యాపారానికి సంబంధించిన అనుభవం ఉంటుంది. వ్యాపార రంగాల్లో మీ క్రెడిట్ పెరుగుతుంది. ఆఫీస్‌లో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఈ రోజు కార్యజయం.  పాత బాకీలు వసూలవుతాయి.   మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.

పరిహారాలుః అమ్మవారిని ఎర్రటి పూలతో ఆరాధించండి.

కన్యరాశి:మీరు శుభవార్తలు వింటారు !

ఈ రోజు మీరు శుభవార్తలు వింటారు. పిల్లల చదువు గురించి కొంచెం ఆందోళన చెందుతారు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సమస్యలు. బంధువులతో విభేదాలు.

పరిహారాలుః శుభ ఫలితాల కొరకు గరికతో శ్రీగణపతి ఆరాధన చేయండి.

తులరాశి:మీరు అభివృద్ధి వైపు ప్రయాణిస్తారు !

ఈరోజు సానకూల ఫలితాలు. ఈరోజు సమస్యలను ఒకదాని తర్వాత మరోకటి పరిష్కరించుకోగలుగుతారు. ఈ రోజు పనులు  సకాలంలో పూర్తి కాగలవు. బంధువులతో సఖ్యత. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు. ఉద్యోగాలలో హోదాలు. సమయానికి అనుగుణంగా నడుచుకోవడం వల్ల మీరు అభివృద్ధి వైపు ప్రయాణిస్తారు.

పరిహారాలుః గ్రహదోషాల నివారణ కోసం నవగ్రహ స్తోత్రం పఠించాలి.

వృశ్చికరాశి:ఈరోజు ఆనందం పెరుగుతుంది !

ఈ రోజు కుటుంబ సభ్యులు మీకు దగ్గరవుతారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సంక్లిష్టమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. లాభదాయకమైన పథకాలలో మీరు పెట్టుబడి పెడుతారు. మానసిక సమస్యల కారణంగా మీకు ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయి. పిల్లల గురించి ఆందోళన ఉంటుంది. పొరుగువారి వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. ఈరోజు వాహనయోగం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. దాంపత్య జీవితంలో ఆనందం పెరుగుతుంది.

పరిహారాలుః ఇష్టదేవతరాధన చేయండి. పేదలకు దానధర్మాలు చేయండి.

ధనస్సురాశి:ఈరోజు శుభసందేశం అందుతుంది !

ఈరోజు శుభసందేశం అందుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. సంపద ఉన్నప్పటికీ కొంత కుటుంబ అశాంతి. ఈరాశి వారికి ఈ రోజు వాహనం ద్వారా లేదా గృహంలో సమస్యలు తలెత్తుతాయి. అనవసర ఖర్చులు చేయకండి. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.  అనారోగ్యం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమాధిక్యం.

పరిహారాలుః మంచి ఫలితాల కొరకు శ్రీ శివపంచాక్షరీ జపం చేయండి.

మకరరాశి:ఈరోజు అనుకున్న పనులు పూర్తి !

ఈరోజు గ్రహచలనాల రీత్యా మీ అనుకున్న పనులు, వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. పనులలో తొందరపాటు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. కుటుంబ సమస్యలు తీర్చుకోవడంలో బిజీగా ఉంటారు. మీరు ఆలోచించే చేసే పనులు విజయవంతమవుతాయి. స్నేహితుల సహకారం కూడా ఉంటుంది.  ఉద్యోగాలలో సమస్యలు రావచ్చు.

పరిహారాలుః అనుకూలమైన ఫలితాల కోసం అశ్వత్థవృక్షం చుట్టూ (రావి) చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి.

కుంభరాశి:ఈరోజు కార్యక్రమాలు విజయవంతం !

ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. ఈ రోజు ఉత్సాహంతో కొన్ని పనులు  పూర్తి చేస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

పరిహారాలుః పేదలకు దానధర్మాలను చేయండి.

మీనరాశి:ఈ రోజు పనుల్లో  విజయం సాధిస్తారు !

ఈ రోజు పనుల్లో  విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో పురోగతి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. సమస్యలు ముగుస్తాయి. ఆర్థిక కారణాల వల్ల మీ జీవిత భాగస్వామి మీకు దూరమవుతారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు.

పరిహారాలుః ఆరోగ్యం కోసం సూర్యరాధన చేయండి.

  • శ్రీ

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version